బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - Nov 13, 2020 , 02:00:45

సత్యనారాయణరెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటాం

సత్యనారాయణరెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటాం

  • పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
  • చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి

కాల్వశ్రీరాంపూర్‌: అకాల మరణం చెందిన కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత పులి సత్యనారాయణరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి భరోసానిచ్చారు. గురువారం బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. అంతకుముందు సత్యనారాయణరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సత్యనారాయణరెడ్డి మరణం పార్టీకి తీరనిలోటని చెప్పారు. పార్టీ అభివృద్ధికి ఆయన నిర్విరామంగా శ్రమించారని కొనియాడారు. సీఎం కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ఆయన కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పారు. అనంతరం చిన్నరాత్‌పల్లి గ్రామానికి చెందిన పోతరవేణి శ్రావణి ఇటీవల ఆత్మహత్య చేసుకోగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ నూనేటి సంపత్‌, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, విండో చైర్మన్‌ చదువు రాంచంద్రారెడ్డి, డైరెక్టర్‌ కేతుపెల్లి నర్సింహారెడ్డి, ఆర్బీఎస్‌ మండల కో ఆర్డినేటర్‌ నిదానపురం దేవయ్య, కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ ఇబ్రహీం, టీఆర్‌ఎస్‌ నేతలు జూకంటి అనిల్‌, ఆడెపు రాజు, జిన్న రాంచంద్రారెడ్డి, పాలకాని కనుకయ్య, సదానందం, సారంగపాణి ఉన్నారు.