శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Nov 12, 2020 , 01:53:40

రోడ్లపై వాహనాలు నిలిపితే జరిమానా

రోడ్లపై వాహనాలు నిలిపితే జరిమానా

పెద్ద్దపల్లి టౌన్‌: రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపితే జరిమానా విధించనున్నట్లు ట్రాఫిక్‌ సీఐ ఉపేందర్‌ హెచ్చరించారు. పెద్దపల్లి పట్టణంలో నో పార్కిం గ్‌ స్థలాల్లో ఇష్టానుసారంగా నిలిపిన ద్విచక్ర వాహనాలను బుధవారం ట్రాఫిక్‌ పోలీసులు రికవరీ వ్యాన్‌ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి ఈ డ్రైవ్‌ చేపట్టామని వివరించారు. జెండా చౌరస్తా, కమాన్‌రోడ్డు, అయ్యప్ప టెంపుల్‌, బస్టాండ్‌ ప్రాంతాల్లోని వ్యాపార సముదాయల వద్ద వాహనాలు సరిగా పెట్టేలా యజమానులు చూసుకోవాలని సూచించారు.