శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Nov 12, 2020 , 01:48:19

రక్షణ చర్యలపై జీఎంల సమీక్ష

రక్షణ చర్యలపై జీఎంల సమీక్ష

గోదావరిఖని: ఆర్జీ-1 పరిధిలోని భూగర్భ గను ల్లో ప్రమాదాల నివారణకు చేపడుతున్న రక్షణ చర్యలపై ఆర్జీ-1 జీఎం కే నారాయణ సమీక్షించారు. ఈ మేరకు ఆయన జీడీకే-1,3 గనులను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గని కార్యాలయంలో సేఫ్టీ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని రక్షణ చర్యలపై సమీక్షించారు. గతంలో భూగర్భ గనిలో విధులు నిర్వర్తిస్తూ పని స్థలాల్లో ప్రమాదాలకు గురైన వారికి జీఎం ఫోన్‌ చేసి వారి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ రక్షణ సూ త్రాలను పాటిస్తూ విధులను నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో సేఫ్టీ ఆఫీసర్‌ కేవీ రావు, ఏజెంట్‌ సురేశ్‌, మేనేజర్‌ ఎస్‌పీ సింగ్‌, సేఫ్టీ ఆఫీసర్‌ శ్రీనివాస రెడ్డి, ఫిట్‌ సెక్రటరీ రమేశ్‌ రెడ్డి, సేఫ్టీ కమిటీ సభ్యులు ఉన్నారు. 

వకీల్‌పల్లి గనిపై ..

యైటింక్లయిన్‌ కాలనీ: ఆర్జీ-2 పరిధిలోని వకీల్‌పల్లి గనిపై జీఎం సురేశ్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గనిలోని 3వ సీమ్‌ టాప్‌ సెక్షన్‌కు సం బంధించిన పని స్థలాల్లో రక్షణ పరమైన చర్యలపై ఆయన సర్వే మ్యాప్‌ ద్వారా పరిశీలించి అధికారులతో మాట్లాడారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించేందుకు ఏర్పాట్లు చేయాలని, అలాగే మ్యాన్‌ పవర్‌, ఈ నెలలో గనిలో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులతో చర్చించారు. ఆయన వెంట గని గ్రూపు ఏజెంట్‌ శ్రీనివాస రెడ్డి, డీజీఎం మురళీకృష్ణ, సర్వే అధికారి రాంమ్మోహన్‌ తదితరులున్నారు.