ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Nov 11, 2020 , 01:21:48

కేసుల నియంత్రణ అభినందనీయం

కేసుల నియంత్రణ అభినందనీయం

పెద్దపల్లి టౌన్‌: పెద్దపల్లి సర్కిల్‌ పరిధిలో కేసుల నియంత్రణకు పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని ఇన్‌చార్జి ఏసీపీ ఉమేందర్‌ కొనియాడారు. ఉత్తమ సేవలు అందిస్తున్న పలువురు కానిస్టేబుళ్లకు పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో మంగళవారం ప్రశంసాపత్రాలతోపాటు రివార్డులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజురోజుకూ పెరుగుతున్న నేర ప్రవృత్తిని అరికట్టడంలో కానిస్టేబుళ్లు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రజలు కూడా మధ్యవర్తుల సహాయంతో కాకుండా నేరుగా పోలీసుల ఉన్నతాధికారులను సంప్రందించి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఆయన వెంట సీఐ ప్రదీప్‌కమార్‌, ఎస్‌ఐ రాజేశ్‌ ఉన్నారు.