గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Nov 11, 2020 , 01:21:47

డీఎంహెచ్‌వో సమీక్ష

డీఎంహెచ్‌వో సమీక్ష

మంథని టౌన్‌: స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో వైద్య సిబ్బందితో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలోని గద్దలపల్లి, ముత్తా రం పీహెచ్‌సీల వైద్య సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగిలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్యశాలకు వస్తున్న రోగుల జాబితాను రోజూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసెస్‌ ప్రోగ్రాం, టీబీ ప్రోగ్రాంలను సక్రమంగా నిర్వహించాలన్నారు. మలేరియా లాంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనాతో ఆగిపోయిన కార్యక్రమాలన్నింటినీ తిరిగి కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ వాణిశ్రీ, డాక్టర్లు పురుషోత్తం, రాజమౌళి, కృపాబాయి, మెడికల్‌ ఆఫీసర్‌ శంకరాదేవి, డాక్టర్లు నరేశ్‌, వంశీకృష్ణ, హెచ్‌ఈవో శ్రీనివాస్‌, రమేశ్‌, తిరుపతిరెడ్డి, సూపర్‌వైజర్లు ఏసుమని వీరేశ్‌, రాజేశ్‌, ఏఎన్‌ఎంలు తదితరులున్నారు.