శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Nov 11, 2020 , 01:27:39

లారీ ఢీకొని మహిళ మృతి

లారీ ఢీకొని మహిళ మృతి

పెద్దపల్లి టౌన్‌: పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన పస్తం ముత్తమ్మ(50) మంగళవారం పెద్దపల్లి పట్టణం రాజీవ్‌ రహదారిపై ఇసుక లారీ ఢీకొని మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం .. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం నకినీపల్లి గ్రామానికి చెందిన పస్తం ముత్తమ్మ బతుకుదెరువు కోసం అప్పన్నపేటకు వలస వచ్చింది. రోజువారీగా పరుపుల వ్యాపారం చేసుకునేది. తన స్వగ్రామం నకినీపల్లికి వెళ్లేందుకు కొడుకు జమాల్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. పట్టణంలోని కూనారం క్రాస్‌రోడ్‌ వద్ద మంథని నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇసుక లారీ ద్విచక్రవాహనాన్ని వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వాహనం వెనుకాల కూర్చున్న ముత్తమ్మ కిందపడగా లారీ ముందు టైరు ఆమె పైనుంచి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కొడుకు జమాల్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. పెద్దపల్లి ఎస్‌ఐ రాజేశ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.