బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Nov 10, 2020 , 02:31:00

నల్లబ్యాడ్జీలతో నిరసనలు

నల్లబ్యాడ్జీలతో నిరసనలు

గోదావరిఖని: ప్రధాని మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ఆర్జీ-1 పరిధిలోని అన్ని గనులపై సోమవారం ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో వేర్వేరుగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు గనులపై మాట్లాడు తూ,  ఈ నెల 26వ తేదీన దేశ వ్యాప్తంగా తలపెట్టిన జాతీయ సమ్మెను సింగరేణిలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమాల్లో నాయకులు ఎల్లయ్య గౌడ్‌, ఆరెల్లి పోశం, రంగు శ్రీను, మహేశ్‌, వెంకటేశ్‌, ప్రసాద్‌, మహేందర్‌ రావు, సంకె అశోక్‌, రాజయ్య, రామస్వామి, నాగేందర్‌, సతీశ్‌బాబు, సంపత్‌, మెండ శ్రీనివాస్‌, నాయకులు ఎం.సారయ్య, వేణుగోపాల్‌ రెడ్డి, శంకర్‌, రాయమల్లు, కారం సత్తయ్య, రాములు, ప్రభాకర్‌, లక్ష్మణ్‌, రాములు, కిషన్‌, శివరాంరెడ్డి, దుర్గా ప్రసాద్‌, యాదగిరి, నారాయణ, ఓదెలు, మొండయ్య, సంతోష్‌, రాజమౌళి, శ్రీనివాస్‌, గజేంద్ర, దేవేందర్‌ ఉన్నారు.

సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు

 సమ్మెలో భాగంగా సీఐటీయూ నాయకులు  సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు అం దించారు. సమ్మెకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మంద నరసింహారావు, వెంకటేశ్వరరావు, విజయగిరి శ్రీనివాస్‌, వీరస్వామి, రాజమొగిలి తదితరులున్నారు. 

యైటింక్లయిన్‌ కాలనీ : సమ్మెను జయపద్రం చేయాలని ఐఎఫ్‌టీయూ రీజియన్‌ అధ్యక్షుడు అశోక్‌ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక యూ నియన్‌ కార్యాలయంలో కాంట్రాక్టు కార్మికులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో నర్సయ్య, రాయనర్సు, మొండి, నిర్మల, బుచ్చమ్మ, రాజనర్సు, రాజ్‌కుమార్‌, శ్యాం తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్జీ-2 ఏరియాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం కేంద్ర ఉ పాధ్యక్షుడు ప్రకాశ్‌ మాట్లాడారు. కార్యక్రమంలో రాజారత్నం, అన్నారావు, సాంబశివరావు, సెగ్గం శంకర్‌, సంపత్‌, శంకర్‌, రవికుమార్‌, కనుకయ్య, సంపత్‌, కిరణ్‌, శ్రీనివాస్‌, సంపత్‌రెడ్డి ఉన్నారు. 

సమ్మెను జయప్రదం చేయాలి..

జ్యోతినగర్‌: ఈ నెల 26వ తేదీన జాతీయ కార్మిక సంఘాలు తల పెట్టిన దేశవ్యాప్త సమ్మెను ఎన్టీపీసీలో కాంట్రాక్ట్‌ కార్మికులు జయప్రదం చేయాలని నాయకులు కోరారు. ఎన్టీపీసీలో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన ఎన్టీపీసీలో సమ్మె సన్నాహక సదస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ, ఇతర సంఘాల నాయకులు సీహెచ్‌ ఉపేందర్‌, సత్యం, నాంసాని శంకర్‌, లక్ష్మారెడ్డి, చిలుక శంకర్‌, భూషణం, లక్ష్మణ్‌ ఉన్నారు.