బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Nov 10, 2020 , 02:31:04

రైతు చెంతనే ధాన్యం కేంద్రాలు

రైతు చెంతనే ధాన్యం కేంద్రాలు

  •  సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలి
  •  పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

పెద్దపల్లి రూరల్‌: తెలంగాణ ప్రభుత్వం రైతుల సౌకర్యం కోసం వారి చెంతనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నదని, వీటిని సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి సూచించారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో ఐకే పీ ఆధ్వర్యంలో, ముత్తారంలో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం హమాలీలకు కొవిడ్‌-19 నేపథ్యంలో మాస్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌గౌడ్‌, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, సర్పంచులు ఆడెపు వెంకటేశం, ఎద్దు కుమారస్వామి, ఎంపీటీసీ తోట శ్రీనివాస్‌, ఏపీఎం సంపత్‌, నాయకులు మర్కు లక్ష్మణ్‌, ఎరబాటి వెంకటేశ్వర్‌ రా వు, అర్కుటి రామస్వామి యాదవ్‌, బొడ్డు చంద్రయ్య యాదవ్‌, గాండ్ల సతీశ్‌, రమేశ్‌, ఎల్లయ్య, అంజయ్య, స్వామి, పర్వతాలు, ఓదెలు, సదయ్య, రాజ్‌కుమార్‌, నాంసాని రాజయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి 

 ధాన్యం అమ్మకాల సందర్భంగా రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అప్పన్నపేట సింగిల్‌ విండో చైర్మన్‌ దాసరి చంద్రారెడ్డి సూచించారు. అప్పన్నపేటలోని సిం గిల్‌విండో కార్యాలయంలో సోమవారం ధాన్యం కొనుగోళ్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ సమక్షంలో పలు తీర్మానాలు చేశారు. విండో పరిధిలోని పలు గ్రామాల్లో 15 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ సంపత్‌, సీఈవో సతీశ్‌ ఉన్నారు.

 సంక్షేమమే లక్ష్యం 

సుల్తానాబాద్‌రూరల్‌: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. సుల్తానాబాద్‌ మండ లం కాట్నపల్లి, కోమండ్లపల్లి, నీరుకుళ్ల, కదంబాపూర్‌, సుద్దాల, రేగడిమద్దికుంట, అల్లీపూర్‌ గ్రామాల్లో సుల్తానాబాద్‌, సుద్దాల సింగిల్‌విండోలు, సెర్ప్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే  ప్రారంభించారు.  కార్యక్రమాల్లో ఎంపీపీ బాలాజీరావు, జడ్పీటీసీ మినుపాల స్వరూపారాణి ప్రకాశ్‌రావు, వైస్‌ ఎంపీపీ కోట స్వప్న రాంరెడ్డి, పీఏసీఎస్‌ల చైర్మన్లు శ్రీగిరి శ్రీనివాస్‌, గడ్డం మహిపాల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఢిల్లీశ్వర్‌రావు, సర్పంచులు మోహన్‌రెడ్డి, కోటగిరి విజేందర్‌, కోడెం సురేఖ, కాసర్ల అంజలి, అన్నెడి రవీందర్‌రెడ్డి, గడ్డం వసంత మోహన్‌రెడ్డి, ఎంపీటీసీలు శీలం శంకర్‌, నిర్మల, రాజమణి, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ కాసర్ల అనంతరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు అన్నెడి మహిపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు పాల రామారావు, నా యకులు రమేశ్‌గౌడ్‌, చంద్రయ్య, బూర్గు వీరయ్య, మాధవరావు, మీస చంద్రయ్య, సతీశ్‌, సంపత్‌, వేముల రాజిరెడ్డి, బుర్ర శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే గర్రెపల్లి, నర్సయ్యపల్లి గ్రామాల్లో గర్రెపల్లి పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇక్కడ పీఏసీఎస్‌ చైర్మన్‌ జూపల్లి సందీప్‌రావు, వైస్‌ చైర్మన్‌ ధీకొండ శ్రీనివాస్‌, సర్పంచులు వీరగోని సుజాత రమేశ్‌గౌడ్‌, లావణ్య వెంకట్‌ తదితరులు ఉన్నారు. 

దళారులను నమ్మి మోసపోవద్దు 

కాల్వశ్రీరాంపూర్‌ : రైతులు పండించిన ధాన్యా న్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే దాసరి సూచించారు. సెర్ప్‌, సహకార సంఘం ఆధ్వర్యంలో మీర్జంపేట, తారుపల్లి, మల్యాల, పందిల్ల, లక్ష్మీపురం, పెగడపల్లి, ఆశన్నపల్లి, మడిపల్లి, అంకంపల్లిల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సం పత్‌, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, ఏవో నాగార్జున, విండో చైర్మన్‌ చదువు రాంచంద్రారెడ్డి, సర్పంచులు పుప్పాల నాగార్జునరావు, బైరం రమేశ్‌, దాసరి లావణ్య, బండ రవీందర్‌రెడ్డి, అరెల్లి సుజాత, నాగరాజు, రాణి,  ఎంపీటీసీలు రాంచంద్రం, సదానందం, సుముఖం నిర్మల, సీఈవో కోలేటి శ్రీనివాస్‌, డైరెక్టర్లు, ఆర్బీఎస్‌ మండల కన్వీనర్‌ నిదానపురం దేవయ్య, నాయకులు కామిడి వెంకట్‌రెడ్డి, ఇబ్రహీం, రామిడి తిరుపతిరెడ్డి, జూకంటి అనిల్‌, సిరికొండ కొమురయ్య, మాదాసి రాంచంద్రం, అరెల్లి రమేశ్‌, నవీన్‌, రాంచంద్రారెడ్డి తదితరులున్నారు. 

సద్వినియోగం చేసుకోవాలి

ధర్మారం: రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ పిలుపునిచ్చారు. ధర్మారం మండలం నంది మేడారం సింగిల్‌ విండో, సెర్ప్‌ ఆధ్వర్యంలో కటికెనపల్లి, కొత్తూరు, బుచ్చయ్యపల్లి, నర్సింహులపల్లి, ఖానంపల్లి, పైడిచింతలపల్లి, రచ్చపల్లి, దొంగతుర్తి, ఖిలావనపర్తిలో ఏర్పాటు చేసిన  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ, జడ్పీ సభ్యురాలు పూస్కూరు పద్మజ, విండో చైర్మన్‌ ము త్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గుర్రం మోహన్‌రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. కార్యక్రమాల్లో పత్తిపాక సింగిల్‌ విండో చైర్మన్‌ నోముల వెంకటరెడ్డి, ఆర్‌బీఎస్‌ బాధ్యులు పాకాల రాజయ్య, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, పాక వెంకటేశం, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ గూడూరి లక్ష్మణ్‌, సెర్ప్‌ ఏపీఎం కనకయ్య, సర్పంచులు కారుపాకల రాజయ్య, తాళ్ల మల్లేశం, ఇమ్మడిశెట్టి కొమురయ్య, అడువాల అరుణజ్యోతి, గుర్రం మనీషా, బద్దం వెంకటమ్మ, మోర సుధాకర్‌, ఎంపీటీసీలు సూరమల్ల శ్రీనివాస్‌, తాళ్లపల్లి భద్రమ్మ, బెల్లాల రోజారాణి, దాడి సదయ్య, మోతె సుజాత తదితరులున్నారు.

మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం.. 

ముత్తారం: రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని ముత్తారం పీఏసీఎస్‌ చైర్మన్‌ గుజ్జుల రాజిరెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై మండలంలోని రైతు లు, ప్రజాప్రతినిధులతో ముత్తారం మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ కార్యాలయంలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా, రాజిరెడ్డి హాజరయ్యారు. అనంతరం ముత్తారంలోని కొనుగోలు కేంద్రాన్ని రాజిరెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ చెలుకల అశోక్‌ స్వర్ణలత, ఆర్‌బీఎస్‌ మండలాధ్యక్షుడు అత్తె చంద్రమౌళి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు పొతిపెద్ది కిషన్‌రెడ్డి, తహసీల్దార్‌ వెంకటలక్ష్మి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ పొతిపెద్ది రమణారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుమార్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ నాంసాని సమ్మయ్య, ఏవో శ్రీకాంత్‌, మంథని కేడీసీసీ మేనేజర్‌ శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ రవీందర్‌రావు, డైరెక్టర్లు యాదగిరిరావు, గుజ్జ గోపాల్‌రావు, లింగారావు, గిరి వీరేందర్‌, కొంకటి మల్లయ్య, అల్లం గోవర్ధన్‌, ఎలువాక కొమురయ్య, ఐతె రాజు, కురాకుల ఓదెలు, సర్పంచులు సిరికొండ బక్కారావు, సంపత్‌రావు, మహేందర్‌ యాదవ్‌, మేడగోని సతీశ్‌గౌడ్‌, పులిపాక నగేష్‌, ఎర్రం శారద, నాయకులు గట్టు రమేశ్‌, భగీరథ రాము, రావుల కుమార్‌ తదితరులున్నారు.