గురువారం 03 డిసెంబర్ 2020
Peddapalli - Nov 09, 2020 , 01:33:48

ప్రజలకు అండగా గులాబీ జెండా

ప్రజలకు అండగా గులాబీ జెండా

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరికలు

జ్యోతినగర్‌: రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ టీఆర్‌ఎస్‌ పార్టీ గులాబీ జెండా అండగా ఉంటుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. ఎన్టీపీసీ 23వ డివిజన్‌లోని అంబేద్కర్‌కాలనీకి చెందిన   కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆదివారం టీఆర్‌ఎస్‌ పార్టీ లో  చేరగా, ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దాదాపు వంద మందికిపైగా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా, వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సీఎంగా కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్నారని వివరించారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన వారిలో సుదమల్ల భూమయ్య, అల్లాడి శంకర్‌, పెరుక వెంకటస్వామి, తగరం రాజేందర్‌, లక్ష్మణ్‌, ఇతరులు ఉన్నారు. అంతకుముందు శనివారం రాత్రి ఐదో డివిజన్‌లో ఎమ్మెల్యే ఓపెన్‌ డ్రైనేజీ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇక్కడ డివిజన్‌ కార్పొరేటర్‌ కృష్ణవేణి, తదితరులు ఉన్నారు.  కార్యక్రమంలో రామగుండం నగరపాలక మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్‌, ఎన్వీ రమణారెడ్డి, టీఆర్‌ఎస్‌ కార్పొరేషన్‌ అధికార ప్రతినిధి తోడేటి శంకర్‌ గౌడ్‌, ఎన్టీపీసీ పట్టణ ఇన్‌చార్జి పాతిపెల్లి ఎల్లయ్య, 23వ డివిజన్‌ ఇన్‌చార్జి కుమ్మరి శారద ఉన్నారు.