ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Nov 07, 2020 , 01:24:46

ఆర్థిక సాయాలు.. సేవా కార్యక్రమాలు

ఆర్థిక సాయాలు.. సేవా కార్యక్రమాలు

ఘనంగా నల్ల మనోహర్‌రెడ్డి జన్మదిన వేడుకలు
కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ
ఓదెల:  టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, నల్ల ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు నల్ల మనోహర్‌రెడ్డి జన్మదిన వేడుకలు పలు గ్రామాల్లో ఆయన అభిమానులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నల్ల మనోహర్‌రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో స్వామి వా రి వద్ద పూజలు చేశారు. శానగొండ, పొత్కపల్లి గ్రామాల్లో గర్భిణులు, బాలింతలకు పండ్లు, బ్రె డ్లు, పాలు అందజేశారు. పొత్కపల్లిలో మహ్మద్‌ రఫిక్‌ కూతురు పెండ్లికి రూ. 2500 వితరణ చే శారు. గోపరపల్లిలో యువకులకు వాలీబాల్‌ కిట్‌ ను అందజేశారు. పలు గ్రామాల్లో కేక్‌ కట్‌ చేసి, ప్రజలకు స్వీట్లను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో నల్ల ఫౌండేషన్‌ సభ్యుడు జీల రాజేందర్‌, మాజీ ఎంపీటీసీ బోడకుంట శంకర్‌, ఆటో యూనియన్‌ అధ్యక్షుడు రంగు ఆనంద్‌గౌడ్‌, మండల కోఆప్షన్‌ ఎండీ సాహెద్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కాశవేన నరేశ్‌, ఎండీ అజారొద్దీన్‌, శివరాజ్‌, తిరుపతి, తుంగాని అనిల్‌, బోయిని కుమార్‌, జంగ వేణు, అరుణ్‌ తదితరులున్నారు.   
జూలపల్లి : టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కలిసి కీచులాటపల్లి, చీమలపేట, పెద్దాపూర్‌, తేలుకుంట, వడ్కాపూర్‌ గ్రామాల్లో కేక్‌ కట్‌ చేసి, పలువురికి పంచిపెట్టారు. మనోహర్‌రెడ్డి పుట్టిన రోజు పురస్కరించుకొని ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'లో భాగంగా కాచాపూర్‌లో నల్ల యువసేన అధ్యక్షుడు బాలసాని సాగర్‌ మృతుడు గాలిపెల్లి శంకర్‌ కుటుంబానికి రూ. ఐదు వేలను ఆర్థికసాయంగా అందజేశారు. అలాగే వెంకట్రావ్‌పల్లిలో బడుగు సతీశ్‌ ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబ సభ్యులకు రూ. 4 వేలు ఆర్థికసాయం చేశారు. జూలపల్లిలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు చేసి, గ్రామస్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఇక్కడ వైస్‌ ఎంపీపీ మొగురం రమేశ్‌, ఎంపీటీసీ సభ్యుడు కత్తెర్ల శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ పొట్టాల మల్లేశం, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పాటకుల అనిల్‌, నాయకులు రేశవేని శ్రీనివాస్‌, నాడెం మల్లారెడ్డి, తాటిపెల్లి రాయలింగం, చొప్పరి మహేశ్‌, కందుకూరి సాయికుమార్‌, కొత్తకొండ సతీశ్‌, కూనిరాజుల హరీశ్‌, కన్నం అనిల్‌, గాలిపెల్లి రమేశ్‌, అరుణ్‌, అజేయ్‌, సాగర్‌, వంశీ, నవీన్‌ పాల్గొన్నారు.
పెద్దపల్లి కల్చరల్‌: జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తాలో నల్ల ఫౌండేషన్‌ సభ్యులు, నాయకులు, అభిమానులు జన్మదిన కేక్‌ను కట్‌ చేసి, స్వీట్లు పంచి పెట్టారు. ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'లో భాగంగా నల్ల ఫౌండేషన్‌ సభ్యులు, అభిమానులు పెద్దపల్లికి చెందిన యువతి ఆసియా వివాహానికి రూ. ఐదువేలు, రాఘవాపూర్‌కు చెందిన విద్యార్థి నితిన్‌ చదువుకు రూ. ఐదువేలు, పెద్దబొంకూర్‌కు చెందిన అనారోగ్యానికి గురైన సర్వర్‌ చికిత్స కోసం రూ. 6వేలను అందించి ఆదుకున్నారు. అలాగే పెద్దపల్లిలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల పాఠశాలలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ సభ్యులు, అభిమానులు కేక్‌ కట్‌ చేశా రు. విద్యార్థులకు స్వీట్లు, పండ్లు అందించారు.   
ఎలిగేడు: నల్ల ఫౌండేషన్‌ సభ్యులు ఎలిగేడు గ్రామ శివాలయంలో పూజలు చేసి, అనంతరం అంబేద్కర్‌ చౌరస్తాలో పటాకులు కాల్చి వేడుకలు చేపట్టారు. కేక్‌ కట్‌ చేసి, ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం సభ్యులంతా కలిసి రూ. 10వేలు పోగు చేసి, సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన గణేశ్‌ బాసరలో ట్రిపుల్‌ ఐటీ సీటు సాధించగా, ఆయన ఉన్నత చదువు కోసం రూ. ఐదువేలు, ఇటీవల అనారోగ్యంతో మరణించిన నర్సాపూర్‌ గ్రామానికి చెందిన తంగెళ్లపల్లి సంపత్‌ భార్య శ్రావణికి రూ. ఐదువేలు అందజేశారు. నల్ల మనోహర్‌రెడ్డి సేవలను ఎలిగేడు సర్పంచ్‌ బూర్ల సింధూజ కొనియాడారు. ఇక్కడ నర్సాపూర్‌ సర్పంచ్‌ తంగెళ్ల స్వప్న-కుమార్‌యాదవ్‌, సుల్తాన్‌పూర్‌ ఉప సర్పంచ్‌ ఆకుల హరీశ్‌గౌడ్‌, దుండ్ర కోమలత, నాయకులు ఆశాడపు వెంకటేశ్‌, కోట సంపత్‌, కప్పల ప్రవీణ్‌, బాసంపెల్లి వినోద్‌, ప్రతాప్‌, ఆశాడపు అజయ్‌, శ్రీనివాస్‌, సాయి, శ్రీకాంత్‌, సన్నీ, ప్రశాంత్‌, సిద్ధి తిరుపతి, దేవేందర్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్‌: పట్టణంలో నిరుపేదలకు నల్ల ఫౌండేషన్‌ సభ్యులు, మనోహర్‌రెడ్డి అభిమానులు అన్నదానం చేశారు. కార్యక్రమంలో తుమ్మ రాజ్‌కుమార్‌, దేవేందర్‌పటేల్‌, శెట్టి శ్రీనివాస్‌, గోలి సాయిచంద్ర, కట్ల విజయ్‌, గోపి, తుమ్మ నిషాంత్‌, తోట నవీన్‌, సందీప్‌, కట్ల ప్రణయ్‌ తదితరులున్నారు.