మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Nov 05, 2020 , 02:12:20

జలాలు సద్వినియోగం చేసుకోవాలి

జలాలు సద్వినియోగం చేసుకోవాలి

ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో మరుగుదొడ్లు, సోలార్‌ విద్యుత్‌ కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి 

జిల్లా పరిషత్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ 

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టుతో అందిస్తున్న సాగు జలాలను సద్వినియో గం చేసుకోవాలని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పిలుపునిచ్చారు. 1, 2, 4, 7వ స్థాయీ సం ఘాల సమావేశాలను  బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఫైనా న్స్‌, ప్లానింగ్‌, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి పనులపై ఆయన సమీక్షా సమావేశాన్ని చేపట్టా రు. ఈ సందర్భంగా మధూకర్‌ మాట్లాడుతూ, జిల్లాలోని 231 గ్రామాల్లో ఇప్పటికే మిషన్‌ భగీరథ పనులు పూర్తయ్యాయని తెలిపారు. నీటి నాణ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఆయా గ్రామాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన గతంలోని మోటర్లు, మీటర్లను తొలగించాలని ఆదేశించారు. మిషన్‌ భగీరథ నీళ్లు అందుతున్నా పాత మోటర్లను నడిపిస్తూ, మరమ్మతు చేయిస్తున్నారని తెలిపారు. ఈ విష యమై సంబంధిత అధికారులు దృష్టిసారిం చాలని వివరించారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంకా చేపట్టాల్సిన రూ. 15 కోట్లకు సంబంధించిన పనులను సైతం త్వరిత గతిన పూర్తి చేయాలని మధూకర్‌ ఆదేశించారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం 75 శాతం మొక్కల సంరక్షణ చర్యలను తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, సామూహిక మరుగుదొడ్లు, రైతు వేదికలు, మంకీ ఫుడ్‌ కోర్టులతో పలు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. మైనింగ్‌ శాఖ ద్వారా జిల్లాలో చిన్న, పెద్ద ఖనిజాలకు సంబంధించి వస్తున్న లీజ్‌లు, ప్రభుత్వానికి అందుతున్న నిధుల విషయంపై సమీక్షించారు. జిల్లాలో 31 కంకర క్రషర్లు, 43 గ్రానైట్‌ స్టోన్‌ కటర్స్‌, సున్నపు రాయి లీజ్‌ల విషయంపై చర్చించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మిల్ల ర్లు, రైతులు సమన్వయంతో వ్యవహరించాలని, ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. 

లాభదాయకమైన పంటలు పండించాలి

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లతోపాటుగా సోలార్‌ విద్యుత్‌ సరఫరాకు సంబంధించి అధికారులు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో  ప్రధాన రహదారుల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని, ఇప్పటికే టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్లతో పనులు పూర్తి చేయించేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత పెరిగిన భూగర్భ జల శాతాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు లాభదాయకమైన పంటలను పండించేలా వ్యవసాయ, ఉద్యానవన అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గీత, డీఆర్డీవో వినోద్‌కుమార్‌, డీఏవో తిరు మల్‌ప్రసాద్‌, డీఈవో జగన్మోహన్‌ రెడ్డి, సీపీవో ఇస్మాయిల్‌, పీఆర్‌ ఈఈ ముణిరాజ్‌, జిల్లా మైనింగ్‌ అధికారి సాయినాథ్‌, ఆర్‌అండ్‌బీ, ఐబీ, వాటర్‌గ్రిడ్‌, ఇన్‌ఫ్రా ఈఈలు వెంకటేశ్వర్‌రావు, బలరామయ్య, సతీశ్‌, పూర్ణచందర్‌ ఉన్నారు.