ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Nov 04, 2020 , 02:00:49

ధరణితో రైతులకు ప్రయోజనం

ధరణితో రైతులకు ప్రయోజనం

పెద్దపల్లి రూరల్‌: ధరణి పోర్టల్‌ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ తెలిపారు. పెద్దపల్లి తహసీల్‌ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన ధరణి సేవల కేంద్రాన్ని  మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మధూకర్‌ మాట్లాడుతూ, ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు ఆస్కా రం ఉండదని స్పష్టం చేశారు. రైతులకు సంబంధించిన యాజమాన్యం పట్టా పాస్‌ పుస్తకం ఉంటేనే భూ ముల లావాదేవీలు కొనసాగుతాయని తెలిపారు. నాలుగు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తహసీల్దార్‌ దుర్శెట్టి శ్రీనివాస్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ భవానీ ప్రసాద్‌ తదితరులున్నారు. 

నివాళి..

మంథని టౌన్‌: పట్టణంలోని ఎరుకలగూడెంకు చెందిన చింతపట్ల రాములు మంగళవారం మృతి చెందగా, ఆయన భౌతికకాయానికి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మృతికి గల కారణాలను కుటుం బ సభ్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు వారిని ఓదార్చారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలున్నారు.