మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Nov 04, 2020 , 01:56:04

కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి

కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి

రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలి

ప్రజాప్రతినిధుల సూచన

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని, రై తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు అధికారులకు సూ చించారు. ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశాన్ని పెద్దపల్లి అమర్‌చంద్‌ కల్యాణ మండపంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. కొనుగోళ్ల ప్రక్రియపై ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. 

రైతు పక్షపాతి..

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రైతులు పండించిన పంటలను పూర్తిగా కొన్న ప్రభుత్వం దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. సీఎం కేసీఆర్‌ పూర్తిగా రైతు పక్ష పాతి. ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా ఏ పార్టీ రాజకీయం చేయవద్దు. 

-భానుప్రసాదరావు, మండలి విప్‌  

ఆదేశాలు పాటించాలి 

తెలంగాణ ప్ర భుత్వం ధాన్యం కొనుగోళ్లకు సంబం ధించి ఇచ్చే ఆదేశా లను తప్పకుండా పాటిస్తే ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడడు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైస్‌ మిల్లర్లు, రైతులు సమన్వయం చేసుకొని ముందుకు సాగితే ప్రయోజనం కలుగుతుంది.  

-బోర్లకుంట వెంకటేశ్‌నేత, పెద్దపల్లి ఎంపీ

నిర్లక్ష్యం చేస్తే సహించం

సీఎం కేసీఆర్‌, మంత్రులు పెడుతున్న సమీక్షల్లో అధికారులు, రైస్‌ మిల్లర్లు అన్నీ చేస్తామని చెప్పి వస్తున్నారు. కానీ ఫీల్డ్‌ మీదికి వచ్చే సరికి రైతులను కొందరు అధికారులు, రైస్‌ మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు. ఇక వీటిని సహించేది లేదు.

-పుట్ట మధూకర్‌, జడ్పీ చైర్మన్‌

అదే అవగాహనతో పని చేయాలి

సమావేశంలో నిర్ణయించిన విధంగా కొనుగోళ్లను ప్రారంభించిన నాటి నుంచి చివరి నాటి వరకూ ఇదే అవగాహనతో పనిచేయాలి. పీఏసీఎస్‌, ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులకు  ప్రయోజనం కలుగుతున్నది. పెద్ద గ్రామాల్లో రెండు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. 

-దాసరి మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే 

ప్రతి కేంద్రంలో ఎలక్ట్రానిక్‌ కాంటాలు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు నష్టపోతున్న తీరును చూసే ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ కాంటాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం సంకల్పాన్ని నెరవేర్చాలంటే రైతులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైస్‌ మిల్లర్లు అందరూ సహకరించాలి. రైస్‌ మిల్లర్ల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. 

-కోరుకంటి చందర్‌, రామగుండం ఎమ్మెల్యే

టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయాలి 

 తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు ఇబ్బందులు కలుగకుండా టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. ఫోన్‌ చేసిన పావుగంటలో వారి వద్దకు సిబ్బంది వెళ్తారు. సమస్యకు పరిష్కారం చూపుతారు. రైతులు కోసిన వెంటనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దు. కోసి ఆరబెట్టిన తర్వాత సరైన తేమ శాతం ఉన్న ధాన్యాన్నే తీసుకురావాలి. 

- శ్రీకాంత్‌రెడ్డి, డీసీఎమ్మెస్‌ చైర్మన్‌