మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Nov 04, 2020 , 01:51:32

ఆదర్శమీ కుటుంబం

ఆదర్శమీ కుటుంబం

భార్యభర్తలు సహా పిల్లలిద్దరూ అవయవదానానికి అంగీకారం

కోల్‌సిటీ: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నగరంలోని తిలక్‌నగర్‌కు చెందిన కాంట్రాక్టర్‌ చింతకింది సంపత్‌కుమార్‌ తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. తనతోపాటు భార్య బిన్సీ, కొడుకులు ప్రణవ్‌, సిద్ధార్థ అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చి, అంగీకార పత్రాలను ఆ డివిజన్‌ కార్పొరేటర్‌ పెంట రాజేశ్‌ చేతుల మీదుగా సదాశయ ఫౌండేషన్‌ బాధ్యులు లింగమూర్తి, కేఎస్‌ వాసులకు అందజేశారు. కాగా, తన మిత్రుడు రెండేళ్ల క్రితం అవయవాలు దొరక్క చనిపోయాడనీ, ఆ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందనీ, అవయవదానం చేయాలని అప్పటి నుంచే అనుకుంటున్నానని, ఈ రోజు నిర్ణయం తీసుకున్నట్లు సంపత్‌కుమార్‌ తెలిపారు.  కార్యక్రమంలో గుళ్ల శ్రీనివాస్‌, చింతల సతీశ్‌, చిలుముల మహేందర్‌, గోగుల మధు, నవీన్‌, రంగు ప్రకాశ్‌, హరీశ్‌, రహీం, మహేశ్‌, రాజ్‌కుమార్‌, రాజు ఉన్నారు.