బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - Nov 03, 2020 , 01:11:16

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

పెద్దపల్లిరూరల్‌: ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని హన్మంతునిపేట సర్పంచ్‌ తీగల సదయ్య కోరారు. హన్మంతునిపేటలో సోమవారం ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బ్యాంకింగ్‌, ఏసీ రిపేర్‌,  సోలార్‌, ఎలక్ట్రిషియన్‌ విభాగాల్లో ఉచిత శిక్షణపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ మంథని కోఆర్డినేటర్‌ మల్లికార్జున్‌, ఎంపీటీసీ గుర్రాల లక్ష్మీగట్టేశం తదితరులున్నారు.