గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Nov 03, 2020 , 01:11:15

అభివృద్ధికి సహకరించండి

అభివృద్ధికి సహకరించండి

మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ను కోరిన రామగుండం ఎమ్మెల్యే చందర్‌

రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే సోమవారం హైదరాబాద్‌లో వారిని వేర్వేరుగా కలిశారు. నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో గడిచిన రెండేళ్లలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని, రామగుండంలో ఇండస్ట్రీయల్‌ పార్కు, ఐటీ పార్కుతోపాటు మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని కేటీఆర్‌కు విన్నవించారు. అలాగే  నియోజకవర్గంలో సంగీత కళాశాలను ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరారు. ఆయన వెంట డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌ రావు తదితరులు ఉన్నారు. - గోదావరిఖని