మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Nov 02, 2020 , 01:29:32

సిమెంట్‌ బెంచీల ఏర్పాటు

సిమెంట్‌ బెంచీల ఏర్పాటు

పెద్దపల్లి జంక్షన్‌: పట్టణంలోని ముఖ్య కూడళ్ల వద్ద లయన్స్‌ క్లబ్‌ పెద్దపల్లి ఎలైట్‌ ఆధ్వర్యంలో సిమెంట్‌ చెంచీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక ఐటీఐ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్లబ్‌ జిల్లా గవర్నర్‌ గుర్రం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. లయన్స్‌ ఎలైట్‌ సభ్యులు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో 50 సిమెంట్‌ చెంచీలు ఏర్పాటు చేశారని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి వంశీరాజ్‌, కోశాధికారి సంపత్‌రావు, బాబురావు, జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌, రవీందర్‌, అనిల్‌, గుజ్జుల కుమార్‌, వెంకటేశ్‌, సతీశ్‌రెడ్డి, శ్రావణ్‌, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.