మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Oct 31, 2020 , 00:55:57

అభివృద్ధి పనులపై సర్పంచుల చర్చ

అభివృద్ధి పనులపై సర్పంచుల చర్చ

ఎలిగేడు: అభివృద్ధి పనులపై మండలంలోని సర్పంచులంతా ఎలిగేడు గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, మార్గదర్శకాలను పాటిస్తూ సంబంధిత అధికారులు కూడా సహకరిస్తున్నారని, గ్రామాల అభివృద్ధిలో మండలాన్ని ముందు వరుసలో ఉంచాలని పేర్కొన్నారు.  గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు  అప్పగించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయా గ్రామా ల సర్పంచులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాల్లో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాడ కొండాల్‌రెడ్డి (నారాయణపల్లి సర్పంచ్‌) అధ్యక్షతన చేపట్టిన సమావేశంలో సర్పంచులు బూర్ల సింధూజ(ఎలిగేడు), గొల్లె కావేరి(ధూళికట్ట), సింగిరెడ్డి ఎల్లవ్వ(లాలపల్లి), దేవరనేని ప్రభావతి(లోకపేట), పెద్దోళ్ల ఐలయ్య యాదవ్‌(ముప్పిరితోట), తంగెళ్ల స్వప్న(నర్సాపూర్‌), చిలుముల సౌమ్య(రాములపల్లి), గోపు విజయేందర్‌రెడ్డి(ర్యాకల్‌దేవ్‌పల్లి), అర్శనపల్లి వెంకటేశ్వరరావు(సుల్తాన్‌పూర్‌) తదితరులున్నారు.