గురువారం 03 డిసెంబర్ 2020
Peddapalli - Oct 31, 2020 , 00:45:39

వచ్చే నెల 21న తెప్పల పోటీలు

వచ్చే నెల 21న తెప్పల పోటీలు

రామగుండం ఎమ్మెల్యే  చందర్‌ 

 గోదావరిఖని: గోదావరి నదిలో నవంబర్‌ 21వ తేదీన తెప్పల పోటీలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తెలిపారు. దేశానికి తెలిసేలా మరోసారి ఇక్కడ రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ మత్స్యవీర కేసీఆర్‌ కప్‌ రాష్ట్ర స్థాయి తెప్పల పోటీల వాల్‌ పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించి మాట్లాడారు. ఎడారిని తలపించేలా ఉన్న గోదావరిని కాళేశ్వరం ప్రా జెక్టుతో నిండుకుండలా మార్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని కొనియాడారు. గతేడాది గోదావరిలో తెప్పల పోటీలను 228 మంది పోటీదారులతో ఘనంగా నిర్వహించామన్నారు. ఈ ఏడాది కూడా వచ్చే నెల 21 నిర్వహిం చే పోటీల్లో పోటీదారులు పాల్గొనాలని కోరారు. అంతకుముందు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన గోలివాడ ప్రసన్నను ఎమ్మెల్యే అభినందించారు. ఆగస్టు 15న ట్రా న్సెంట్‌ అడ్వంచర్‌, స్నో లిఫర్స్‌ అడ్వంచర్‌ సం యుక్తంగా నిర్వహించిన పర్వతారోహణలో పాలొ ్గన్న 995 మంది పర్వతారోహకుల ఫొటోలు గంట సమయంలో ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసినందుకు గానూ ప్రసన్న గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించి ఈ ప్రాంతానికే వన్నె తెచ్చాడంటూ అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కృష్ణవేణి, నీల పద్మ, అడ్డాల గట్టయ్యతోపాటు గోలివాడ ప్రసన్న, సంతప్‌, బస్వరాజు గంగరాజు ఉన్నారు.