మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Oct 30, 2020 , 05:35:52

యువత ఆర్థికంగా ఎదగాలి

యువత ఆర్థికంగా ఎదగాలి

పెద్దపల్లి కల్చరల్‌: యువత అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా ఎదగాలని నల్ల ఫౌండేషన్‌ అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నల్ల మనోహర్‌రెడ్డి ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీరాఘవేంద్ర టీ షాపు (టీ బాస్‌)ను ఆయన గురువారం ప్రారంభించారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఉప్పు రాజు, సాబీర్‌ ఖాన్‌, జాకీర్‌ హుస్సేన్‌, భీమోజు సురేందర్‌, నల్ల ఫౌండేషన్‌ సభ్యులు అలువోజు రవితేజ, కార్తిక్‌ తదితరులున్నారు. అనంతరం 13వ వార్డుకు చెందిన సొన్నాయిటెంకం కార్తిక్‌ ఇటీవల మరణించగా, బాధిత కుటుంబ సభ్యులను మనోహర్‌రెడ్డి పరామర్శించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఇక్కడ నల్ల ఫౌండేషన్‌ సభ్యులు అశోక్‌, బషీర్‌, బిట్టు తదితరులు ఉన్నారు.  

పెద్దపల్లిరూరల్‌: హన్మంతునిపేటలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన బాలసాని తిరుపతి కుటుంబాన్ని నల్ల మనోహర్‌రెడ్డి పరామర్శించి, రూ.5 వేలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తీగల సదయ్య, ఎంపీటీసీ గుర్రాల లక్ష్మీగట్టేశం, మాజీ ఎంపీటీసీ గణబోయిన మల్లేశం, పెద్దపల్లి పీఏసీఎస్‌ డైరెక్టర్‌ మేకల కుమార్‌ యాదవ్‌, నాయకులు నాగేశ్వర్‌రావు, సదయ్య, సతీశ్‌గౌడ్‌, అనిల్‌, తిరుపతి, వెంకటేశ్‌, శ్రీనివాస్‌, మునీందర్‌ పాల్గొన్నారు.