శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Oct 29, 2020 , 00:26:44

తహసీల్దార్‌ ఎదుట ఇద్దరి బైండోవర్‌

తహసీల్దార్‌ ఎదుట ఇద్దరి బైండోవర్‌

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో తరచూ గొడవలకు కారణమవుతున్న ఇద్దరిని  తహసీల్దార్‌ దుర్శెట్టి శ్రీనివాస్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్లు బసంత్‌నగర్‌ ఎస్‌ఐ షేక్‌ జానీ పాషా తెలిపారు. గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు ఉప్పు సదయ్య, సతీశ్‌ తరచూ గొడవ పడుతుండడంతో శాంతి భద్రతల దృష్ట్యా వారిని బైండోవర్‌ చేసినట్లు వెల్లడించారు. తిరిగి గొడవలకు దిగితే రూ. రెండు లక్షల జరిమానా చెల్లించేలా షరతులు విధించినట్లు పేర్కొన్నారు