సోమవారం 30 నవంబర్ 2020
Peddapalli - Oct 29, 2020 , 00:26:45

ఆర్చరీ కిట్‌ అందజేత

ఆర్చరీ కిట్‌ అందజేత

పెద్దపల్లి జంక్షన్‌: ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి తానిపర్తి చికితను ప్రోత్సహించేందుకు ఆర్చరీ కిట్‌ను అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అందజేశారు. ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత గతంలో జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలో ప్రతిభ చూపి, బంగారు పతకాలు సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ తీసుకునేందుకు కలెక్టర్‌ ప్రత్యేక నిధుల నుంచి రూ. 3 లక్షల 28 వేలతో కొనుగోలు చేసిన ఆర్చరీ కిట్‌ను క్రీడాకారిణికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పట్టుదలతో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయిలో సైతం ప్రతిభ చూపాలని, దేశానికి, రాష్ర్టానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇక్కడ జిల్లా యువజన క్రీడాశాఖాధికారి సుధాకర్‌ ఉన్నారు.