మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Oct 29, 2020 , 00:26:43

నిరుద్యోగులకు ఆహ్వానం

నిరుద్యోగులకు ఆహ్వానం

పెద్దపల్లి జంక్షన్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ప్రైవేట్‌ ఉద్యోగాల కోసం నిరుద్యోగులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి వినోద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డీఆర్డీవో-ఈజీఎంఎం ఆధ్వర్యంలో సంగం ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పని చేసేందుకు 30 మంది సిబ్బంది అవసరమని వెల్లడించారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, 19 నుంచి 35 ఏళ్లలోపు నిరుద్యోగులు ఈ నెల 31వ తేదీన పెద్దపల్లిలోని ఈజీఎంఎం ట్రైనింగ్‌ సెంటర్‌లో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.