ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Oct 29, 2020 , 00:08:57

చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌

చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌

ఈ నెల 6న మెగా కంపెనీ కార్యాలయంలో నగదు అపహరణ

వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ రవీందర్‌

జ్యోతినగర్‌: అంతర్గాం మండలం గోలివాడ పంప్‌హౌస్‌  పనులు చేపడుతున్న మెగా కంపెనీ కార్యాలయంలో ఈ నెల 6న  రూ. 20 లక్షల నగదు చో రీకి గురైన  విషయం విదితమే. ఈ కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఎన్టీపీసీ ఠాణా లో బుధవారం విలేకరుల సమావేశం  ఏర్పాటు చేసి పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ వివరాలు వెల్లడించారు. గోలివాడ పంప్‌హౌస్‌లో పని చేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికుడు తన గ్రామానికి చెం దిన మరో ముగ్గురితో కలిసి  ఈ నెల 6న రాత్రి మెగా కంపెనీ కార్యాలయంలోని బీరువాను పగులగొట్టి నగదును అపహరించారు. పీఆర్వో మూర్తి నారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఉత్తరప్రదేశ్‌లోని శ్రా వస్తి జిల్లా  కతిరామాఫీ గ్రామానికి చెందిన వారు చోరీ చేసినట్లు గు ర్తించారు. అక్కడికి వెళ్లిన పోలీసు లు రాజు, వీరేంద్రకుమార్‌ను ప ట్టుకున్నారు. ధర్మేందర్‌ పరారీలో ఉన్నాడు. పట్టుబడ్డ వారిని  విచారించగా నగదు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వీరి వద్ద నుంచి  రూ. లక్ష స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. నిందితుల కోసం రామగుండం సీఐ, అంతర్గాం ఎస్‌ఐ, సిబ్బంది రాజేందర్‌, ప్రభాకర్‌ సిబ్బంది ఇక్కడి నుంచి యూపీలోని నేపాల్‌ బోర్డర్‌  దాకా సుమా రు 1800 కిలో మీటర్లు ప్రయాణించి నిందితులను పట్టుకున్నారు.  డీసీపీ వీరిని అభినందించి నగదు రివార్డు అందజేశారు. అలాగే సాంకేతిక సిబ్బంది మైకాంత్‌, ఫింగర్‌ ప్రింట్‌ విభాగం సిబ్బంది శ్రీనివాస్‌, రవీందర్‌కు కూడా రివార్డులు  అందించారు. ఇక్కడ గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌, రామగుండం సీఐ కరుణాకర్‌రావు, అంతర్గాం ఎస్‌ఐ నూతి శ్రీధర్‌ ఉన్నారు.