గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Oct 28, 2020 , 01:06:33

యువతి వివాహానికి ఆర్థికసాయం

యువతి వివాహానికి ఆర్థికసాయం

జూలపల్లి: తల్లిదండ్రులను కోల్పోయిన యువతి వివాహానికి ఓ ఎన్‌ఆర్‌ఐ ఆర్థికసాయం అందించి అండగా నిలిచాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అబ్భాపూర్‌ గ్రామానికి చెందిన గుంటి లావణ్య తల్లిదండ్రులను కోల్పోయి తన మేనమామ కంబల్ల రాజమల్లు వద్ద ఉంటున్నది. లావణ్యకు చొప్పదండి మండలం వెంకట్రావ్‌పల్లి గ్రామానికి చెందిన యువకుడితో ఈనెల 29న వివాహం నిశ్చయమైంది. దీంతో కొమ్మ రాజేశం తన బాల్యమిత్రుడు ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కొలుముల దామోదర్‌ అనే ఎన్‌ఆర్‌ఐకి లావణ్య దయనీయ పరిస్థితి వివరించగా, అతడు స్పందించి తన తండ్రి పెద్దలింగయ్య చేతులమీదుగా రూ.15వేల నగదు అందించాడు. ఈ సందర్భంగా యువతితోపాటు, పలువురు గ్రామస్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్‌ వీర్ల మల్లేశం, నాయకులు జక్కని మల్లేశం, కచ్చు కొమురయ్య, బైర బక్కయ్య పాల్గొన్నారు.