శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Oct 28, 2020 , 01:06:33

పరామర్శలు.. ఆర్థికసాయాలు

పరామర్శలు.. ఆర్థికసాయాలు

సుల్తానాబాద్‌ రూరల్‌: నర్సయ్యపల్లి గ్రామానికి చెందిన గాజుల చంద్రయ్య అనే నిరుపేద అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. చంద్రయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని నల్లా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత మనోహర్‌రెడ్డి హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానలో చేర్పించి చికిత్స చేయించాడు. కాగా అతడు చికిత్స పొందుతూ మృతిచెందగా బాధిత కుటుంబాన్ని నల్లా మనోహర్‌రెడ్డి పరామర్శించి రూ.10వేల ఆర్థికసాయం అందించారు. ఇక్కడ సర్పంచ్‌ లావణ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ సందీప్‌రావు, మాజీ సర్పంచ్‌ రాజయ్య, యూత్‌ సభ్యులు అనిల్‌, పడాల మధు, మహేశ్‌ తదితరులు ఉన్నారు. 

బాధిత కుటుంబాలకు..

పెద్దపల్లి రూరల్‌: పెద్దబొంకూర్‌ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలతో ఇండ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను నల్లా మనోహర్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం స్థానిక నాయకుల ద్వారా బాధిత కుటుంబాలకు చెందిన గజ్జల కొమురయ్య, ఎర్ర మల్లమ్మకు రూ.2,500 చొప్పున ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కారుపాకల మానస, మాజీ ఎంపీటీసీ కారుపాకల సంపత్‌, ఎంపీటీసీ మిట్లపల్లి వసంత, నాయకులు మిట్టపల్లి వెంకటేశం, మిట్టపల్లి శ్రీనివాస్‌, లక్ష్మీరాజం, రాయమల్లు, చంద్రమౌళి, లచ్చయ్య, అఖిల్‌, రఘు, రాకేశ్‌ పాల్గొన్నారు.

క్రీడాసామగ్రి అందజేత

జూలపల్లి: అబ్భాపూర్‌లో వాలీబాల్‌ క్రీడాకారులకు నల్లా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మనోహర్‌రెడ్డి క్రీడాసామగ్రి, రూ.5వేల నగదును మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దండె వెంకటేశం, మాజీ ఎంపీటీసీ కచ్చు బీరయ్య, పోటీల నిర్వాహకుడు బొమ్మనవేని సతీశ్‌, నాయకులు పాటకుల అనిల్‌, కొమ్మ రాజేశం, కచ్చు కొమురయ్య, పప్పు కుమార్‌, చొప్పరి మహేశ్‌ పాల్గొన్నారు.