మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Oct 27, 2020 , 05:36:26

వైభవంగా బాబా సమాధి మహోత్సవం

వైభవంగా బాబా సమాధి మహోత్సవం

  • ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మమతారెడ్డి పూజలు

పెద్దపల్లి కల్చరల్‌: శ్రీషిర్డీ సాయిబాబా 102వ సమాధి పూజా మహోత్సవాన్ని జిల్లా కేంద్రంలో వైభవంగా నిర్వహించారు. శాంతినగర్‌లోని షిర్డీ సాయి బాబా మందిరంలో ఆదివారం అర్చకులు జంబోజు శ్రీనివాస శర్మ, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. ఉదయం 6 గంటలకు కాగడ హారతి, 7 గంటలకు పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణతో పాటు ప్రత్యేకమైన లక్ష పువ్వులతో అర్చన పూజలు చేపట్టారు. మధ్యాహ్నం 2గంటలకు బాబా సమాధి పూజా కార్యక్రమం చేశారు. కోదండ రామాలయం, బాబా ఆలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ మమతారెడ్డి, ట్రినిటి విద్యా సంస్థల చైర్మన్‌ దాసరి ప్రశాంత్‌ ప్రత్యేక పూజలు చేయగా, అర్చకులు ఆశీర్వాచనాలు ఇచ్చి, ప్రసాదం అందించారు. అనంతరం రాత్రి 8 గంటలకు కోదండ రామాలయం ముందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రావణవధ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరితో పాటు పలువురు కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.