బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - Oct 25, 2020 , 04:38:28

గోదావరిలో మరోసారి నురుగ

గోదావరిలో మరోసారి నురుగ

గోదావరిఖని నగర శివారులోని గోదావరి నదిలో మరోసారి నురుగ పేరుకుపోయింది. కాళేశ్వరం జలాలతో నిండుకుండలా మారిన నదిలో కొంత కాలంగా నురుగ పేరుకొని భారీ పాయలా కనిపిస్తున్నది. అయితే శనివారం మాత్రం పూల డిజైన్‌లాగ చారలు చారలుగా కనిపించింది. అయితే నురుగ ఎందుకు పేరుకుపోతున్నదో అధికారులకు అంతు చిక్కడం లేదు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇప్పటికే శాంపిళ్లు సేకరించారని, ఫలితాలు రావాల్సి ఉందని చెబుతున్నారు.

- ఫర్టిలైజర్‌సిటీ