ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Oct 24, 2020 , 02:42:10

పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్‌

పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్‌

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి 

66 మందికి రూ. 25లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

పెద్దపల్లి కల్చరల్‌: పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కొనియాడారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 66 మందికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 25 లక్షల విలువైన చెక్కులను శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ అహర్నిశలు పాటుపడుతున్నారని వివరించారు. అనారోగ్యానికి గురైన, రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ పేదలు దవాఖానల్లో ఖర్చుల పాలై ఆర్థికంగా కుంగిపోతున్నారని, వారికి సీఎం సహాయ నిధి ఎంతో బాసటగా నిలుస్తున్నదని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధం గా సీఎం సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీలు బండారి స్రవంతి, పొన్నమనేని బాలాజీరావు, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గజవెల్లి పురుషోత్తం, నాయకులు బండారి శ్రీనివాస్‌ గౌడ్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.