గురువారం 03 డిసెంబర్ 2020
Peddapalli - Oct 23, 2020 , 04:58:41

పండుగలను జాగ్రత్తగా చేసుకోవాలి

పండుగలను జాగ్రత్తగా చేసుకోవాలి

  •  వైద్యాధికారుల సూచన

ఓదెల: సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు జాగ్రత్తగా చేసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా ప్రోగ్రాం అధికారులు డీఎంవో రాజమౌళి, యూవర్స్‌ ప్రోగ్రాం అధికారి ఈఈఎంసీహెచ్‌ డాక్టర్‌ వాణిశ్రీ కోరారు. గురువారం ఓదెల దవాఖాన పరిధిలోని బాయమ్మపల్లి, నాంసానిపల్లి, అబ్బిడిపల్లి, లంబాడీతండా, అలాగే పీహెచ్‌సీని వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలకు పండుగల సందర్భంగా తీసుకోవాల్సి జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమాల్లో డాక్టర్‌ చక్రధర్‌, సీహెచ్‌వో నాగపూరి రవీంద్రకుమార్‌గౌడ్‌, హెచ్‌ఎస్‌ ఆంజనేయులు, క్రిస్టియానా, విద్యాసాగర్‌, వైద్య సిబ్బంది రాజ్యలక్ష్మి, కృష్ణవేణి, విజయలక్ష్మి, మాధవి, శోభ, శారద, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఎలిగేడు: మండలంలోని ఎలిగేడు, నర్సాపూర్‌, సుల్తాన్‌పూర్‌, బుర్హాన్‌మియాపేట, శివపల్లి, ముప్పిరితోట, ధూళికట్ట, రాములపల్లి, ర్యాకల్‌దేవ్‌పల్లి, లాలపల్లి, నారాయణపల్లిలో వైద్యాధికారి నిస్సీక్రిస్టినా పర్యటించారు. పండుగల నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.