ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Oct 22, 2020 , 02:57:53

అమ్మవారి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండాలి

అమ్మవారి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండాలి

 రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌

గోదావరిఖని: దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో రామగుండం నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కోరారు. ఈ మేరకు గోదావరిఖని జవహర్‌నగర్‌లో గల శ్రీ జయ దుర్గాదేవి ఆలయంలో బుధవారం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆధ్వర్యంలో జరిగిన చండీహోమం, పూర్ణాహుతి పూజా కార్యక్రమాలకు మంత్రి ఈశ్వర్‌ దంపతులు హాజరై అమ్మవారి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో హోమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా జడ్పీచైర్మన్‌ పుట్ట మధు, శైలజ, నగర మేయర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌ రావు, కార్పొరేటర్‌ పాతపెల్లి లక్ష్మీ ఎల్లయ్య, ధర్మారం జడ్పీటీసీ పూస్కూరు పద్మ, నాయకులు అచ్చ వేణు, అడప శ్రీనివాస్‌ తదితరులున్నారు.