శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Oct 22, 2020 , 02:46:29

ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

పెద్దపల్లి రూరల్‌: ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. హన్మంతునిపేటలో ఏర్పాటు చేసిన శుద్ధ జలకేంద్రాన్ని ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించి మాట్లాడారు. మిషన్‌ భగీరథ పథకం గొప్ప కార్యక్రమం అని కొనియాడారు. బతుకమ్మ పండుగ మహిళలు భౌతికదూరం పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు.  ఇటీవల కురిసిన వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. వ్యవసాయశాఖ అధికారులంతా పంటల నష్టం అంచనాలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, సర్పంచ్‌ తీగల సదయ్య, ఎంపీటీసీ గుర్రాల లక్ష్మి, మాజీ ఎంపీటీసీలు గణబోయిన మల్లేశం, పడాల చంద్రయ్య, మాజీ ఉప సర్పంచ్‌ మేకల లక్ష్మణ్‌యాదవ్‌, ఉప సర్పంచ్‌ హైమావతి, నాయకులు కొమురయ్య యాదవ్‌, తీగల ధర్మపురి, రాజేశం, పలువురు  నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

రూ.1.10లక్షల విరాళం అందజేత

హన్మంతునిపేట గ్రామానికి చెందిన హోటల్‌ వ్యాపారి కటికెనపల్లి రాజేశం తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వైకుంఠధామం నిర్మాణానికి రూ.1.10లక్షలను ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అతడిని శాలువాతో సన్మానించారు.  

బాధిత కుటుంబాలకు పరామర్శ

పెద్దపల్లి రూరల్‌/పెద్దపల్లి టౌన్‌: పట్టణంలోని 13వ వార్డుకు చెందిన సొన్నాయిటెంకం కార్తీక్‌, వనపర్తి నాగరాజు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. వీరి కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయనవెంట కౌన్సిలర్‌ పాగల సోని శ్రీకాంత్‌, టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్‌ కొయ్యడ సతీశ్‌, నాయకులు పాల్గొన్నారు. రంగాపూర్‌లో అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన భీమగోని బుచ్చయ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు.  ఎమ్మెల్యే వెంట సర్పంచ్‌ గంట లావణ్య, రమేశ్‌, పలువురు వార్డు సభ్యులు, నాయకులతోపాటు పలువురు ఉన్నారు.