బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Oct 22, 2020 , 02:44:24

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

కిష్టంపల్లెలో వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభం

కమాన్‌పూర్‌: స్వశక్తి సంఘాల మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఆకాంక్షించా రు. మండలకేంద్రంలోని కిష్టంపల్లెలో సెర్ఫ్‌ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను జడ్పీ చైర్మన్‌ ప్రారంభించి మాట్లాడారు. మహిళలు ఆర్థిక ప్రగతి సాధించే దిశగా మరింత ముందడుగు వేయాలని చెప్పారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వినోద్‌కుమార్‌, ఎంపీపీ రాచకొండ లక్ష్మి, స్థానిక సర్పంచ్‌ నీలం సరిత, డీపీఎం రవి, ఏపీఎం శైలజాశాంతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇనగంటి భాస్కర్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణ గౌడ్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యులు ఎండీ ఇంతియాజ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, నాయకులు రాచకొండ రవి, నీలం శ్రీనివాస్‌, ఇనగంటి రామారావు, పుల్లెల కిరణ్‌, మల్యాల రాంచంద్రంగౌడ్‌, గడప కృష్ణమూర్తి, కొండ వెంకటేశ్‌, తాటికొండ శంకర్‌, బొజ్జ రాజసాగర్‌, బేతు కుమార్‌, పొనగంటి కనకయ్య, ఆకుల గట్టయ్య, బొల్లపెల్లి లక్ష్మయ్య గౌడ్‌, మారబోయిన ముత్యాలు, ముప్పిడి బాలకృష్ణ, సాన సురేశ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరిక

రామగిరి: చందనాపూర్‌ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ సమక్షంలో బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. కమాన్‌పూర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీలో చేరిన వారిలో మహ్మద్‌ కుదూస్‌, కొండపర్తి సతీశ్‌ పలువురు ఉన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణగౌడ్‌, చందనాపూర్‌ సర్పంచ్‌ దాసరి శంకర్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు ఇబ్రహీం, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బేతు కుమార్‌, తిరుపతి, నాయకులు రాజయ్య, భాస్కర్‌, పుల్లెల కిరణ్‌, జాఫర్‌ తదితరులున్నారు.