గురువారం 03 డిసెంబర్ 2020
Peddapalli - Oct 22, 2020 , 02:44:23

పోలీస్‌ అమరుల త్యాగాలు మరువలేనివి

పోలీస్‌ అమరుల త్యాగాలు మరువలేనివి

రామగుండం సీపీ సత్యనారాయణ

కమిషనరేట్‌లో ఘనంగా పోలీస్‌ అమరుల సంస్మరణ దినోత్సవం

ఫర్టిలైజర్‌సిటీ: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు ల త్యాగాలు మరువలేనివని రామగుండం సీపీ సత్యనారాయణ కీర్తించారు. గోదావరిఖనిలోని కమిషనరేట్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోలీస్‌ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి అమరుల స్తూపం వద్ద కాగడను వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేమన్నారు. ఏ పరిస్థితుల్లోనై నా పోలీసులే ముందుంటారని ఉద్ఘాటించారు. ఈ సంవత్సరంలో దేశంలో ఇప్పటివరకు విధి నిర్వహణలో 264 మంది వీర మరణం పొందారని వివరించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్‌ అశోక్‌ కుమార్‌, ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ సంజీవ్‌, ఏసీపీలు ఉమేందర్‌, ఏఆర్‌ ఏసీపీ సుందర్‌రావు, ఇతర పోలీస్‌ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు ఉన్నారు.