శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Oct 21, 2020 , 02:10:15

హరితహారంతో పచ్చదనం

హరితహారంతో పచ్చదనం

పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని

జ్యోతినగర్‌: హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతున్నదని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని పేర్కొన్నారు. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని మహాత్మాగాంధీ స్టేడియంలో మంగళవారం యాజమాన్యం చేపట్టిన ట్రీ ప్లాంటేషన్‌ కార్యక్రమానికి మంత్రి కొప్పు ల ఈశ్వర్‌తో కలిసి వ చ్చిన ఎంపీ మొక్క నా టి మాట్లాడారు. పర్యావరణ సమతుల్యత, కా లుష్య నివారణ, కోతు ల ఆహార సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ హరితహారం ప్రారంభించారని గుర్తు చేశారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ పేరిట ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని సంకల్పించి, అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, ఎన్టీపీసీ సీజీఎం సునీల్‌కుమార్‌ మొక్కలు నాటారు. ఇక్కడ జీఎం పీకే లాడ్‌, రామగుండం మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కాళేశ్వరం దేవస్థానం కమిటీ డైరెక్టర్‌ ఆరెల్లి సత్యనారాయణ గౌడ్‌, సీఎస్‌ఆర్‌ అధికారి వేముగంటి యుగేంధర్‌రావు తదితరులు ఉన్నారు.

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరణ

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ తలపెట్టిన గ్రీన్‌ చాలెంజ్‌కు అపూర్వ స్పందన వస్తున్నది. మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి విసిరిన గ్రీన్‌ చాలెంజ్‌ను పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని స్వీకరించారు. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లో చేపట్టిన ట్రీ ప్లాంటేషన్‌లో మొక్క నాటారు.