శుక్రవారం 04 డిసెంబర్ 2020
Peddapalli - Oct 21, 2020 , 02:10:13

ఆస్తుల వివరాలను నమోదు చేసుకోవాలి

ఆస్తుల వివరాలను నమోదు చేసుకోవాలి

ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

పెద్దపల్లి టౌన్‌: ప్రతి ఒక్కరు తమ ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతికి ఎమ్మెల్యే తన ఆస్తుల వివరాలను మంగళవారం తెలియజేయగా, ధరిణి వెబ్‌సైట్‌లో నమోదు చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మున్సిపల్‌ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ప్రజలందరూ విధిగా తగిన సమాచారం అందించాలని సూచించారు. ఆస్తుల వివరాలను తెలియజేసి ధరిణి వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.