సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Oct 21, 2020 , 02:06:09

సంప్రదాయాలకు ప్రతీక

సంప్రదాయాలకు ప్రతీక

గోదావరిఖని ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తి జీవీఎన్‌ భారతలక్ష్మి

ఫర్టిలైజర్‌సిటీ: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తున్నదని గోదావరిఖని ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తి జీవీఎన్‌ భారత లక్ష్మి పేర్కొన్నారు. గోదావరిఖని బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇక్కడ గోదావరిఖని ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి పర్వతపు రవి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మేడ చక్రపాణి, ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్‌, మహిళా ప్రతినిధి పద్మజ, న్యాయవాదులు దాసరి భవాని, శైలజ, అనురాధ, అంజలి, విజయ, ప్రియాంక, నవ్య, సుల్తానా, వరలక్ష్మి, షర్మిలా, శోభ, రజిత, భూమయ్య, శ్రీనివాస్‌, అవినాష్‌, రాజ్‌కుమార్‌, లింగస్వామి, ప్రదీప్‌, శేఖర్‌, కుమార్‌, ప్రవీణ్‌, సతీశ్‌, రాజేందర్‌, శ్రీధర్‌ తదితరులున్నారు. అలాగే ఖని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఇక్కడ దవాఖాన సూపరింటెండెంట్‌ శ్రీనివాస రెడ్డి, వైద్యులు మోహన్‌ రావు, సంతోషిణి, శ్రీలత, సమత, సరళి, అనూష, హెడ్‌ నర్సు జమున, పద్మ, రుద్రమ, భవాని, పరంజ్యోతి, సూపరింటెండెంట్‌ శ్రీనివాస రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

కోల్‌సిటీ: గోదావరిఖని పవర్‌హౌస్‌ కాలనీలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రీజినల్‌ ఆర్గనైజర్‌ మూల విజయారెడ్డి ఆధ్వర్యంలో కనుల పండువగా నిర్వహించారు. కార్యక్రమంలో సంధ్యారెడ్డి, సంతోషరెడ్డి తదితరులు ఉన్నారు.