మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Oct 21, 2020 , 02:06:08

విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి

విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి

అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

మైనింగ్‌ విభాగంలో గోల్డ్‌మెడల్‌ సాధించిన మదర్‌థెరిసా విద్యార్థి సాయికి అభినందన 

పెద్దపల్లిరూరల్‌: విద్యార్థులు, యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్‌ శివారులోని మదర్‌ థెరిసా ఇంజినీరింగ్‌ కళాశాలలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన సాకారపు సాయిని మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణ ప్రజల సౌకర్యార్థం 25 ఏండ్లుగా పెద్దపల్లిలో మదర్‌ థెరిసా ఇంజినీరింగ్‌ కళాశాలను నడిపిస్తున్న యాజమాన్యం సేవలు అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులకు మంచి బోధన జరుగుతున్న కారణంగానే మైనింగ్‌ విభాగంలో చదువుతున్న విద్యార్థి సాకరపు సాయి రాష్ట్ర స్థాయి ఫస్ట్‌ ర్యాంకు సాధించి గోల్డ్‌మెడల్‌ పొందడం అభిందనీయమన్నారు. జిల్లాతోపాటు పరిసర ప్రాంత వాసులకు ఇప్పటి దాకా వెయ్యి మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పించారని ప్రశంసించారు. కార్యక్రమంలో కళాశాల మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎడవల్లి నవత, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ అశోక్‌కుమార్‌, డిప్లొమా కళాశాల ప్రిన్సిపాల్‌ పవన్‌కుమార్‌, ఏవో నరేశ్‌, పవన్‌కుమార్‌ తదితరులున్నారు.