గురువారం 22 అక్టోబర్ 2020
Peddapalli - Oct 18, 2020 , 03:36:21

మంథనిలో పారిశుధ్య నిర్వహణ భేష్‌

మంథనిలో పారిశుధ్య నిర్వహణ భేష్‌

మంథని టౌన్‌: మంథనిలో పారిశుధ్య నిర్వహణ బాగుందని మున్సిపల్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ రీసర్చ్‌ అసోసియేట్‌ సాధన కొనియాడారు. పాలకవర్గం చేపట్టిన చర్యలను అభినందించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ అధ్యక్షతన శనివారం బల్దియా కార్యాలయంలో కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సాధన హాజరై మాట్లాడారు. రెండు రోజులు పట్టణంలోని అన్ని వార్డుల్లో పర్యటించినట్లు చెప్పారు. అన్ని ప్రాంతాల్లోనూ పరిశుభ్రమైన వాతావరణం కనిపించిందన్నారు. మంథనిలో అధునాతన పరికరాలతో శానిటేషన్‌ విభాగాన్ని అభివృద్ధి చేసేందుకు రెండు నెలల్లోగా చైర్‌పర్సన్‌ను కలుస్తానని చెప్పారు.  

స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం 

మంథనిని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని బల్దియా చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ ప్రకటించారు. స్వచ్ఛత అవార్డు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగు తామని చెప్పారు. కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ  పట్టణ ప్రగతిలో భాగంగా జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సహకారంతో పట్టణంలో డంప్‌యార్డ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. చెత్త సేకరణకు ట్రాలీలను తీసుకువచ్చామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెల్లి కుమార్‌, కౌన్సిలర్లు వీకే రవి, కుర్రు లింగయ్య, కాయితీ సమ్మయ్య, శ్రీపతి బాణయ్య, గర్రెపల్లి సత్యనారాయణ, నక్క నాగేంద్ర శంకర్‌, గుండా విజయలక్ష్మీ పాపారావు, కోఆప్షన్‌ సభ్యులు ఎస్‌కే యాకుబ్‌, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


logo