శుక్రవారం 30 అక్టోబర్ 2020
Peddapalli - Oct 18, 2020 , 03:36:21

సౌర కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికలు

సౌర కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికలు

n సింగరేణి సంస్థ డైరెక్టర్‌ సత్యనారాయణ

గోదావరిఖని: సింగరేణి సంస్థలో సౌర విద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) డీ సత్యనారాయణ వెల్లడించారు. ఆర్జీ-1 జీఎం కార్యాలయంలోని సెమినార్‌ హాల్‌లో వివిధ డిపార్ట్‌మెంట్ల ఉన్నతాధికారులతో ఆయన శనివారం సమావేశమయ్యారు. జీడీకే-11వ గని మ్యాన్‌ రైడింగ్‌ సిస్టం, చైర్‌ లిఫ్ట్‌ కార్‌ పొడిగింపు, సోలార్‌ పవర్‌ సిస్టంపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే కాలంలో ఎక్కువ శాతం సౌర విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహించాలని సూచించారు. బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తిపై ఆధారపడవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్జీ-1 గ్రూప్‌ ఏజెంట్‌ ఎం సురేశ్‌, 11వ గ్రూపు ఏజెంట్‌ మనోహర్‌, ఏరియా ఇంజినీర్‌ బెనర్జీ బెంజిమన్‌, డీజీఎం ఫైనాన్స్‌ మురళీధర్‌, ఏరియా వర్క్‌షాపు డీజీఎం మదన్‌మోహన్‌, రాందాసు, పర్చేస్‌ డీజీఎం కాశీ విశ్వేశ్వర్‌, గ్రూపు ఇంజినీర్‌ రామకృష్ణ రావు, పర్సనల్‌ మేనేజర్‌ ఎస్‌ రమేశ్‌ తదితరులున్నారు.