శుక్రవారం 23 అక్టోబర్ 2020
Peddapalli - Oct 18, 2020 , 03:20:56

ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి

ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి

మంత్రి కొప్పుల ఈశ్వర్‌

గోదావరిఖనిలో అమ్మవారికి పూజలు 

గోదావరిఖని: దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆకాంక్షించారు. నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం గోదావరిఖని పట్టణంలోని దుర్గాదేవి ఆలయంలో మంత్రి దంపతులతోపాటు ఎమ్మెల్యే చందర్‌ ప్రత్యేక పూజ లు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ యేడు పంటలు సమృద్ధిగా పండాలని, సింగరేణి కార్మికులకు అంతా శుభం కలగాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పా రు. లోక కల్యాణార్థమే ఖనిలో దుర్గాదేవి అమ్మవారి ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పారు. ఇక్కడ రామగుండం మే యర్‌ అనిల్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు పాతపెల్లి లక్ష్మీ ఎల్లయ్య, రమణారెడ్డి, నాయకులు రామస్వామి, కాల్వ శ్రీనివాస్‌, అచ్చవేణు, మెతుకు దేవరాజ్‌, అడప శ్రీనివాస్‌, మండ రమేశ్‌, బొమ్మగాని తిరుపతి గౌడ్‌, తిరుపతి నాయక్‌, శ్రీనివాస్‌ రెడ్డి, కోట రవి, ఇరుగురాళ్ల శ్రావణ్‌, అబ్బాస్‌, వంశీకృష్ణ, శ్రీనివాస్‌ ఉన్నారు.logo