ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Oct 17, 2020 , 01:43:06

బైక్‌పై వెళ్లి.. భరోసానిచ్చి..

బైక్‌పై వెళ్లి.. భరోసానిచ్చి..

వర్షాలకు దెబ్బతిన్న పంటలను  పరిశీలించిన ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి రూరల్‌: ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బైక్‌పై వెళ్లి పరిశీలించారు. పెద్దపల్లి మండలంలోని కనగర్తి, కాసులపల్లి, తుర్కలమద్దికుంట, గొల్లపల్లి, నిట్టూరు గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. బాధిత రైతులతో మాట్లాడి నష్టం వివరాలను తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటామని భరోసానిచ్చారు. పంట నష్టాన్ని అంచనావేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించామని చెప్పారు. ఇది రైతు ప్రభుత్వమని, నష్టపోయిన ప్రతి అన్నదాతనూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.