బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Oct 16, 2020 , 02:15:02

రైతులు ఆందోళనకు గురి కావొద్దు

రైతులు ఆందోళనకు గురి కావొద్దు

పెద్దపల్లిరూరల్ల్‌: వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులు ఆందోళనకు గురికావొద్దని డీఏవో తిరుమల్‌ ప్రసాద్‌ భరోసా ఇచ్చారు. పెద్దపల్లి మండలం నిట్టూరు, తుర్కలమద్దికుంట, గొల్లపల్లిల్లో వర్షాలకు నేల వాలిన పొలాలను గురువారం డీఏవో, వ్యవసాయాధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈవోలు వినయ్‌, శిరీష, ఆర్‌బీఎస్‌ నాయకుడు మాదారపు వేణుగోపాల్‌రావు, మాదారపు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

జూలపల్లి : జూలపల్లి మండలం పెద్దాపూర్‌లో వర్షానికి నేల వాలిన పంటలను డీఏవో తిరుమల్‌ ప్రసాద్‌, ఇన్‌చార్జి ఏవో అలివేణి వేర్వేరుగా పరిశీలించారు. జూలపల్లి, పెద్దాపూర్‌, కుమ్మరికుంట, వెంకట్రావ్‌పల్లిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించారు. ఇక్కడ ఏఈవోలు సతీశ్‌, సాయిప్రసన్న, రమేశ్‌, రైతులు సిరికొండ కొమురయ్య, పాటకుల గట్టయ్య, పొట్టాల బీరయ్య, బండి స్వామి, కొమ్మ పోశాలు ఉన్నారు. 

రామగిరి: వర్షాలతో దెబ్బతిన్న పొలాలను ఆర్‌బీఎస్‌ మండ ల కన్వీనర్‌ మేదరవేణి కుమార్‌ యాదవ్‌ పరిశీలించారు. బేగంపేట, నవాబ్‌పేట గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతుల పొలాల నివేదిక అందజేయాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గాజుల ప్రసాద్‌, కుమారస్వామి, కాపురబోయిన భాస్కర్‌, ఏఎంసీ డైరెక్టర్‌ బేతు కుమార్‌, ఆర్‌బీఎస్‌ గ్రామ శాఖ కన్వీనర్‌ ప్రభాకర్‌ ఉన్నారు. 

ఓదెల: పలు గ్రామాల్లో ఏఈవోలు పర్యటించి నేల వాలిన వరిని రక్షించుకునేందుకు సూచనలు చేశారు. నేలవాలిన వరిని జడచుట్ల మాదిరిగా కట్టలు కట్టుకోవాలని, వడ్లు మొలకెత్తకుండా 50 గ్రాముల ఉప్పు, ఒక లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. పొలం, పత్తిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. పత్తిలో 13.0.45 కిలో ఎకరాకు పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఏఈవోలు సతీశ్‌, స్వప్న, మౌనిక, కిరణ్‌ గ్రామాల్లో పర్యటించారు.