బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Oct 15, 2020 , 02:00:40

పర్యాటక కేంద్రంగా రామగుండం

పర్యాటక కేంద్రంగా రామగుండం

  • lవేగవంతం హరిత హోటల్‌ నిర్మాణ పనులు 
  • lఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతం పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోనున్నదని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి సముద్రాన్ని తలపించేలా మారిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కప్‌ పేరిట గోదావరి నదిలో రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలు మొదటిసారి విజయవంతంగా చేపట్టామని, సీఎంతో ప్రశంసలు కూడా పొందామని ఆయన గుర్తు చేశారు. నది తీరాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని, హరిత హోటల్‌ నిర్మించాలని సీఎంను కోరామని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు మల్కాపూర్‌ శివారులోని సర్వే నంబర్‌ 84లోని 12 గుంటల భూమిని పంచనామా చేసి, లొకేషన్‌ స్కెచ్‌తో రామగుండం తహసీల్దార్‌, జిల్లా టూరిజం అధికారులకు అందజేశారని తెలిపారు. త్వరలోనే మల్కాపూర్‌ శివారులో హరిత హోటల్‌ నిర్మాణానికి పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు.