గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Oct 08, 2020 , 07:54:02

దూర దేశంలో నాన్న.. దూరమైన అమ్మ

దూర దేశంలో నాన్న..  దూరమైన అమ్మ

  • ఒంటరైన పిల్లలు 
  • బొప్పాపూర్‌లో విషాదం
  •  ఆపన్న హస్తం కోసం  ఎదురుచూపు 

ఎల్లారెడ్డిపేట: బతుకు దెరువు కోసం నాన్న గల్ఫ్‌ దేశానికి వెళ్లాడు.. అల్లారుముద్దుగా పెంచిన అమ్మ కానరాని లోకాలకు వెళ్లిపోయింది..ఒంటరైన పిల్లలు విగతజీవిగా కనిపించిన తల్లిని చూసి తల్లడిల్లారు..మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కలిచివేసింది..ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్‌కు చెందిన పండుగు నర్సవ్వ (32) ఏడాది నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నది. అప్పులు తెచ్చి పలు దవాఖానల్లో చికిత్స చేయించుకున్నా ఆరోగ్యం కుదుటపడలేదు. ఇన్ని కష్టాల మధ్య భర్త సత్యం సౌదీకి వెళ్లాడు. కాగా, నర్సవ్య ఇటీవల చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చేరింది. పరిస్థితి విషమించడంతో మూడు రోజుల కిందట ఇంటికి తీసుకురాగా బుధవారం ఉదయం మరణించింది. నాన్న దూర దేశంలో ఉండగా, తల్లి కళ్లెదుటే ప్రాణాలు విడువడంతో నందిని(16), జశ్వంత్‌(12), అక్షర (9) కుమిలికుమిలి ఏడ్చారు. ‘అమ్మా..మమ్మల్ని వదిలి ఎక్కడికెళ్తున్నావు.. మేం ఎలా బతికేది’ అంటూ మృతదేహంపై పడిబోరుమని విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. అసలే పేదరికం.. ఆపై అప్పుల భారంతో సతమతమవుతున్న నిరుపేద కుటుంబానికి ఆపన్నహస్తం అందించాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు. సాయం చేయాల్సిన వారు ఆంధ్రాబ్యాంక్‌ 235810100102059 (ఐఎఫ్‌ఎస్‌సీ: ANDB 0002358)లో నగదు జమచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే 7993156486లో సంప్రదించాలని కోరుతున్నారు.