శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Oct 08, 2020 , 07:49:58

మెగా కార్యాలయంలో రూ. 20 లక్షల చోరీ

మెగా కార్యాలయంలో రూ. 20 లక్షల చోరీ

  • సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీలు ఉమేందర్‌, మహేశ్‌
  •  పోలీసులు, ఫింగర్‌ ప్రింట్‌, క్లూస్‌టీం ఆరా
  •  కంపెనీ పీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు

ఫర్టిలైజ్‌సిటీ/ అంతర్గాం: మండలంలోని గోలివాడ పార్వతీ పంప్‌హౌస్‌ నిర్మాణ సంస్థ మెగా కార్యాలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆఫీసులోని బీరువాను పగులగొట్టి రూ. 20 లక్షల నగదును అపహరించారు. మెగా కంపెనీ పీఆర్వో మూర్తి ఫిర్యాదు మేరకు గోదావరిఖని ఏసీపీలు ఉమేందర్‌, మహేశ్‌, రామగుండం, గోదావరిఖని వన్‌ టౌన్‌ సీఐలు కరుణాకర్‌రావు, పర్శరమేశ్‌, అంతర్గాం ఎస్‌ఐ శ్రీధర్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్‌టీం, ఫింగర్‌ ప్రింట్‌ బృందాలతో వివరాలు సేకరించారు. వివరాలు.. మెగా కార్యాలయ క్యాషియర్లు శ్రీనివాస్‌, శ్రీనివాసాచారి ప్రతిరోజూ అవసరమున్న మేరకు నగదును తీసుకెళ్తారు. మిగిలిన నగదును అక్కడే బీరువాలో ఉంచుతారు.

ఈ క్రమంలో కార్యాలయంలో రూ.20 లక్షల నగదు జమైంది. గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయ వెనక డోర్‌ కిటికీని  తొలగించి లోపలికి ప్రవేశించారు. బీరువాను పగులగొట్టి రూ. 20 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. పకడ్బందీ వ్యూహంతో దొంగతనం జరిగింది. విషయాన్ని మెగా కంపెనీ ప్రతినిధులు గోప్యంగా ఉంచి సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. కంపెనీ పీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.