మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Oct 07, 2020 , 02:24:18

ఓదెలలో సినిమా షూటింగ్‌

ఓదెలలో సినిమా షూటింగ్‌

ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన ప్రముఖ దర్శకుడు సంపత్‌నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో కేకే రాధామోహన్‌ డిఫరెంట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఓదెల రైల్వే స్టేషన్‌'ను నిర్మిస్తున్నారు. గత 30 రోజులపాటు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో షూటింగ్‌ పూర్తి చేశారు. మంగళవారం నుంచి ఓదెలలో పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నాలుగు రోజులపాటు ఈ ప్రాంతంలోనే షూట్‌ చేయనున్నారు. తొలి రోజు ఓదెల రైల్వే స్టేషన్‌ ఏరియా, మండల పరిషత్‌ కార్యాలయంతోపాటు పరిసర ప్రాంతాల్లో కన్నడ హీరో వశిష్ట ఎన్‌ సింహా, హీరోయిన్‌ హెబ్బా పటేల్‌తోపాటు పలువురు నటీనటులపై వివిధ సన్నివేశాలను సినిమాటోగ్రఫీ ఎస్‌ సౌందర్‌రాజన్‌ చిత్రీకరించారు. షూటింగ్‌ విషయం తెలియగానే ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరాగా, పోలీసు బందోబస్తు కల్పించారు.