ఆదివారం 06 డిసెంబర్ 2020
Peddapalli - Oct 06, 2020 , 03:12:09

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

సిరిసిల్ల టౌన్‌: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిప ల్‌ పరిధిలోని 20వ వార్డులో కౌన్సిలర్‌ ఆడెపు సౌజన్య ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి చిన్నారులకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ, జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా 1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి చిన్నారులకు మాత్రలు వేస్తారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు బాధ్యతగా మాత్రలు వేయించాలని సూచించారు. ఇందులో డాక్టర్‌ నయీమా, ఏఎన్‌ఎం వనజ, ఆశ కార్యకర్త సంగీత ఉన్నారు.

వైద్యుల సూచనలు పాటించాలి

కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారు వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని డీఎంహెచ్‌వో పేర్కొన్నారు. జిల్లా కేం ద్రంలోని 20వ వార్డులో ఏర్పాటు చేసిన కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించి, మాట్లాడారు. వార్డు పరిధిలో 92 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా, ఏడుగురికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బం దీ చర్యలు చేపట్టిందన్నారు. జిల్లా దవాఖానతోపాటు సర్దాపూర్‌, వేములవాడలోని ఐసొలేషన్‌ సెంటర్లలో రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి హోం ఐసొలేషన్‌లో ఉంటున్న వారికి మందులు అందిస్తూ, క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. 

గంభీరావుపేట: సముద్రలింగాపూర్‌లో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మోతె రాజిరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. చిన్నారులకు తప్పనిసరిగా మాత్రలు వేయించాలని రాజిరెడ్డి సూచించారు. అదే విధంగా గంభీరావుపేటలో మండల వైద్యాధికారి చిన్నారులకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు వేసి, అవగాహన కల్పించారు. 

ముస్తాబాద్‌: మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో సోమవారం వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్లి 19 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు చిన్నారులకు మాత్రలు పంపిణీ చేస్తామని డాక్టర్‌ సంజీవరెడ్డి, సర్పంచ్‌ గాండ్ల సుమతి తెలిపారు.

ఇల్లంతకుంట: వంతడుపులలో వైస్‌ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్‌గౌడ్‌ పిల్లలకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పకుండా మాత్రలు వేయించాలన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు మాత్రలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇందులో సర్పంచ్‌ కట్ట వెంకట్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ పద్మ, ఏఎన్‌ఎం జ్యోతి, ఆశ కార్యకర్తలు పద్మ, విజయ, సౌమ్య ఉన్నారు.

సిరిసిల్ల రూరల్‌: తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ పడిగెల మానస సోమవారం ప్రారంభించారు. చిన్నారులకు తప్పనిసరిగా మాత్రలు వేయించాలని ఎంపీపీ కోరారు. తంగళ్లపల్లి, నేరెళ్ల, చీర్లవంచ పీహెచ్‌సీ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. ఇందులో సర్పంచ్‌ అంకారపు అనిత, వైద్య సిబ్బంది ఉన్నా రు. అలాగే మున్సిపల్‌ పరిధిలోని సర్దాపూర్‌లో కౌన్సిలర్‌ లింగంపల్లి సత్యనారాయణ ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమా న్ని ప్రారంభించారు. చిన్నారులందరికీ మాత్రలు వేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. అంగన్‌వాడీ టీచర్‌ సల్లూరి సునీత, ఆశ కార్యకర్త కాయితి గౌతమి, సిబ్బంది ఉన్నారు.

వీర్నపల్లి: మండల కేంద్రంలోని పీహెచ్‌సీ సబ్‌ సెంటర్‌ ఆవరణలో ఎంపీపీ మాలోత్‌ భూల చిన్నారులకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు, ఆశ కార్యకర్తలకు చీరలను పంపిణీ చేశారు. చిన్నారులకు తప్పనిసరిగా ఆల్బెండజోల్‌ మాత్రలు వేయించాలన్నారు. అనంతరం మొబైల్‌ కొవిడ్‌ టెస్టింగ్‌ సెంటర్‌ను పరిశీలించారు. మండల వైద్యాధికారి ధర్మానాయక్‌, ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షుడు మల్లారపు అరుణ్‌, ఏఎన్‌ఎం సుజాత, ఆశ కార్యకర్తలు ఉన్నారు. 

ఎల్లారెడ్డిపేట: కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని మండల వైద్యాధికారి ధర్మానాయక్‌ కోరారు. సోమవారం మండల కేంద్రం లో వంద మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, కేవలం ఒక్కరికి మాత్రమే పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. ప్రైమరీ కాంటాక్ట్‌ బాధితులు తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే వైద్య సిబ్బంది పలు గ్రామాల్లో ఇం టింటా తిరుగుతూ చిన్నారులకు నులిపురుగుల నిర్మూలన మాత్ర లు పంపిణీ చేశారు.