గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Oct 05, 2020 , 03:24:18

రామగుండంలో ఆస్తుల వివరాల నమోదు ప్రారంభం

రామగుండంలో ఆస్తుల వివరాల నమోదు ప్రారంభం

బల్దియా పరిధిలో మొత్తం 47,765 ఇండ్ల సర్వే

పరిశీలించిన అదనపు కలెక్టర్‌ దీపక్‌

కోల్‌సిటీ:  ప్రభుత్వం  ప్రతి ఒక్కరి ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసేందుకు చేపట్టిన ధర ణి సర్వే రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో మొదలైంది. రాష్ట్ర పురపాలక శాఖ  ఉత్త ర్వు లు జారీ చేయగా,   బల్దియా పరిధిలోని 50 డివిజన్లల్లో ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ప్రతి డివిజన్‌కు ఒక వార్డు అధికారితో సహా మొత్తం 100 మంది సిబ్బందితో ఈ సర్వే చేస్తున్నారు. కాగా, రామగుండం కార్పొరేష న్‌ విభాగంలో పని చేసే 85 మంది సిబ్బందితో పాటు రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాల నుంచి ఆదివారం  మరో 15 మంది వీఆర్‌ఏలతో కార్పొరేషన్‌ పరిధిలోని 47,765 ఇండ్ల వి వరాలు నమోదు చేస్తున్నారు. ఇంటి యజమాని, కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి ‘ధరణి’ పోర్టల్‌లో నిక్షిప్తం చేయనున్నారు.  కాగా ఈ యా ప్‌లో సాంకేతిక లోపం కారణంగా ఆలస్యమైనప్పటికీ శనివారం నుంచి పూర్తి స్థాయిలో పని చేస్తుండడంతో ఇంటి వివరాల నమోదు ప్రక్రియ సులభతరమైనట్లు  బల్దియా ఆర్‌ఐ మనోహర్‌ తెలిపారు. సింగరేణి, ఎన్టీపీసీ, జెన్‌కో తదితర సంస్థలకు సంబంధించి ఆస్తులు, క్వార్టర్లను మినహాయించగా, మొదట బల్దియాకు నెలవారీగా పన్ను లు చెల్లించే ప్రైవేట్‌ గృహాలు 47,765 ఉన్నాయ ని, వీటి వివరాల నమోదు అనంతరం ఆయా ప్ర భుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఆస్తులు కూడా ఈ యాప్‌లో నమోదు చేస్తామని వెల్లడించారు.  శని, ఆదివారాలు రెండు రోజుల్లో సు మా రు 1300 వరకు ఇండ్ల వరకు వివరాలను అప్‌లోడ్‌ చేశారు. అయితే జిల్లాలోనే అత్యధిక విస్తీర్ణం కలిగి 50 డివిజన్లుగా విస్తరించి అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతం కావడంతో నమోదు ప్రక్రి యలో కాస్త జాప్యం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో బల్ది యా అధికారులు   ఆయా మండలాల  ఎంఈవో లను సంప్రదించి సర్వేలో ఉపాధ్యాయులను భాగస్వాములను చేయాలని కోరినట్లు తెలిసింది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ   సర్వేను కొనసాగించారు. సోమవారం నుంచి ఉపాధ్యాయులు కూడా సర్వేలో భాగస్వాములైతే రోజుకు సుమా రు 2వేల ఇండ్ల చొప్పున సర్వే  చేయనున్నారు.

 వివరాల నమోదు ఇలా...

  ధరణి యాప్‌లో  ఆస్తుల వివరాలు నమోదు  కు సిబ్బంది ఇంటింటా సర్వే చేపడుతున్నారు. సి బ్బంది ఇంటికి వచ్చిన సమయంలో ఇంటి యజమాని అందుబాటులో  ఉండాలి,  ఒకవేళ లేనిపక్షంలో అతని ఆధార్‌ కార్డు ద్వారా ఫొటోను సేకరిస్తారు. ప్రత్యక్షంగా ఉంటే ఇంటి యజమాని ఫొ టో తీసుకోవడంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు, వయసు, ఆధార్‌ కార్డు నంబరు, బంధువుల పేర్లు సైతం సేకరించి ధరణి యాప్‌లో ఉన్న ఆప్షన్ల ప్రకారం అప్‌లోడ్‌ చేస్తారు. అలాగే ఒకే ఇంటి మీద ఇద్దరు లేదా ముగ్గురు యజమానులు  ఉంటే రిజిస్ట్రేషన్‌ ఎవరి పేరు మీద ఉన్నదో ఆ యజమానితోపాటు మిగతా వారి పేర్లు సైతం అ దనంగా ఆప్షన్ల ప్రకారం నమోదు చేస్తారు. ఒక ఇంటికి ఇద్దరు, ముగ్గురు హక్కుదారులుగా ఉన్నప్పటికీ ధరణి యాప్‌లో ఆ హక్కుదారులకు సం బంధించి పూర్తి స్థాయి వివరాలను నమోదు చేసి ఇంటి యజమానుల ఫొటోలు తీసుకుంటారు. 

అదనపు కలెక్టర్‌ పరిశీలన.. 

  గోదావరిఖనిలో చేపట్టిన ధరణి సర్వే ప్రక్రియను జిల్లా అదనపు కుమార్‌ దీపక్‌ పరిశీలించారు. నగరంలోని సప్తగిరి కాలనీ, జీఎం కాలనీ, గంగానగర్‌లో జరుగుతున్న ధరణి సర్వేను ఆయన పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా పారదర్శకంగా ఇంటి వివరాలను యాప్‌లో నిక్షిప్తం చేయాలని సూచించారు.  అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.