గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Oct 05, 2020 , 02:47:22

కోడి పందాల శిబిరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

 కోడి పందాల శిబిరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు ఆదివారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు.  టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ షేక్‌ మస్తాన్‌    సిబ్బందితో కలిసి అకస్మికంగా దాడిచేశారు. కోడిపందాలు నిర్వహిస్తున్న బసంత్‌నగర్‌కు చెందిన గడ్డం సదయ్య, పాలకుర్తికి చెందిన రావుల మధునయ్యను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుంచి  నుంచి రూ.1300 నగదు, రెండు బైక్‌లు, ఏడుకత్తులు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని బసంత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు  సీఐ  తెలిపారు. కాగా అప్పన్నపేటకు చెందిన పిడు గు శ్రీనివాస్‌, పిడుగు విజయ్‌ పరారీలో ఉన్నారు. దాడులు చేసిన వారిలో హెడ్‌కానిస్టేబుల్‌ మల్లారెడ్డి, శేఖర్‌, సునీల్‌, నగేశ్‌, చిరంజీవి ఉన్నారు.